![]() |
![]() |

జీ తెలుగు అంటే ఫామిలీకి ఎక్కవ వేల్యూ ఇస్తూ ఆ తరహా ప్రోగ్రామ్స్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే సూపర్ క్వీన్, లేడీస్ & జెంటిల్మెన్ వంటి షోలతో అలరించిన జీ తెలుగు లాస్ట్ వీక్ నుంచి "ఫామిలీ నంబర్ 1 "షోని ప్రసారం చేస్తోంది. ఇందులో 8 ఫామిలీస్ మధ్య పోటీలు పెట్టి ఎంటర్టైన్ చేస్తున్నారు షో మేకర్స్. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కౌశల్ ఫామిలీ వచ్చింది. "ప్రతీ భర్త తన భార్యలో తన తల్లిని చూసుకుంటాడు..నువ్వు అలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకు నీకు పాదాభివందనాలు" అని కౌశల్ చెప్పేసరికి అతని వైఫ్ నీలిమా స్టేజి మీదే కన్నీళ్లు పెట్టేసుకుంది. "ఈరోజు నీలిమ కౌశల్ అంటే అందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు నీలిమ అంటే ఎవరికీ తెలీదు. ఎన్నో జన్మల పుణ్యం నాకు ఈయన దొరకడం" అంటూ కౌశల్ ని పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యింది.
ఇక కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో ఉంటాడు.. బిగ్ బాస్ సీజన్ 2 అంటే చాలు కౌశల్, కౌశల్ ఆర్మీని గుర్తొస్తుంది. ఇక ఈ 8 ఫామిలీస్ కు టాస్క్ లు ఇచ్చి ఆడిస్తున్నాడు హోస్ట్ రవి. అలాగే వాళ్ళు లైఫ్ లో పడిన కష్టాలు, సాధించిన విజయాలను కూడా ఈ షో ద్వారా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ఇక కౌశల్ బీబీ జోడిలో కంటెస్టెంట్ గా కూడా డాన్స్ చేసి చూపించాడు. అలాగే రీసెంట్ గా ప్రసారమైన బీబీ షైనింగ్ స్టార్స్ లో బీబీ పవర్ స్టార్ అవార్డు ని అందుకున్నాడు. ఈ ఫామిలీ నంబర్ 1 షో ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కాబోతోంది.
![]() |
![]() |